మాన్సాస్‌లో మరో వివాదం.. ఉద్యోగులంతా ఒక్కటై..!

-

విజయనగర: మాన్సాస్‌లో మరో వివాదం తలెత్తింది. మాన్సాస్ ఉద్యోగులుపై తాజాగా కేసులు నమోదు అయ్యాయి. ఈవో ఫిర్యాదుతో ఉద్యోగులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పెండింగ్ జీతాల కోసం ఉద్యోగులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఆందోళన సమయంలో మాన్సాస్ ఈవో కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించారు.

తమకు జీతాలు చెల్లించాలంటూ ఈవోతో వాగ్వాదానికి దిగారు. మాన్సాస్ ఛైర్మన్ జీతాలు చెల్లించమని చెప్పినా ఎందుకు జీతాలు చెల్లించడంలేదని ఈవోను నిలదీశారు. దీంతో సీరియస్ అయిన ఈవో తన విధులకు ఉద్యోగులు ఆటంకం కలిగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇది చినికి చినికి వివాదంగా మారుతోంది. ఇవాళ మన్సాస్ ఉద్యోగులు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. కాసేపట్లో ఉద్యోగులు మీడియాతో మాట్లాడనున్నారు.

 

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో మన్సాస్ ఉద్యోగులను మాజీ ఛైర్ పర్సన్ సంచయిత రౌడీలతో పోల్చారు. రౌడీలను పంపి ఈవోపై దాడి చేయిస్తావా అంటూ రెండు రోజుల క్రితం సంచయిత ట్విట్ చేవారు. మాన్సాస్ లో సంచయిత ఉన్నప్పుడు ఒక గొడవ, అశోక్ గజపతి రాజు ఛైర్మన్‌గా ఉండగా ఇప్పుడు మరో వివాదం రాజుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news