తెలంగాణ ప్రభుత్వంపై మైసూరారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కడప: తెలంగాణ ప్రభుత్వంపై సీనియర్ నాయకుడు మైసూరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ వివాదాలపై ఆయన స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీకి రావాల్సిన కృష్ణా జలాలను తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా వాడుకుంటోందని మండిపడ్డారు.

బుధవారం మీడియాతో మాట్లాడుతూ మైసూరారెడ్డి తెలంగాణకు ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతోందని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవచ్చుకదా అని నిలదీశారు. భేషజాలు ఎందుకు అడ్డం వస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి సమస్యలను చర్చించుకోవడం లేదా అని మైసూరారెడ్డి ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఏపీకి మంచిది కాదని సూచించారు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు అని మైసూరారెడ్డి ఆరోపించారు. మరి మైసూరారెడ్డి కామెంట్లపై ఏపీ, తెలంగాణ నేతల ఏమంటారో చూడాలి.