రైల్వే ప్రయాణికులకు షాక్..పండగ పూట భారీ వడ్డింపు..!

పండగ పూట ప్రయాణికులకు రైల్వే షాక్ ఇస్తోంది. దసరా సందర్భంగా సౌత్ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే రైళ్ళను ఏర్పాటు చేసి అధిక చార్జీలతో చుక్కలు చూపిస్తోంది. తాజా నిర్ణయంతో రైల్వే ప్రయాణీకులకు క్లాసును బట్టి ఒక్కో టికెట్ పై అదనంగా రెండు వందల నుండి ఏడు వందల వరకు భారం మోపుతోంది. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి ఎంతో మంది కార్మికులు బీహార్, పశ్చిమ బెంగాల్, రాష్ట్రాలకు పయనం అవుతున్నారు. ఉద్యోగులు సొంత గ్రామాలకు పయనం అవుతున్నారు.

దాంతో రైల్వేశాఖ ఒక్కసారిగా ప్రత్యేక రైళ్లను ప్రకటించి టికెట్ రేట్లు పెంచి చుక్కలు చూపిస్తుంది. అయినప్పటికీ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఇక 14వ తేదీన విశాఖపట్నం గరీబ్ రథ్ రైల్వే టిక్కెట్లన్నీ కేవలం గంటల్లోనే అమ్ముడుపోయాయి. మరోవైపు ఎంతో మంది ప్రయాణికులు వెయిటింగ్ లో ఉన్నారు. అంతేకాకుండా 14వ తేదీన హైదరాబాదు నుండి ఖమ్మం కు 14 రైళ్లు కేటాయించగా టిక్కెట్లని అమ్ముడుపోయాయి.