ఛత్తీస్ ఘడ్ మావోయిస్టుల ఘాతుకం.. ఓ వ్యక్తి మృతి..!

-

చటీస్ ఘడ్ రాష్ట్రం లోని   బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం సృష్టించారు.  ఇన్ ఫార్మర్ నేపంతో  గ్రామస్థుడిని హత్య చేసారు  మావోయిస్టులు. మృతుడు మత్వారాకు చెందిన మడివి దూలారుగా గుర్తించారు.  జంగ్ల అటవీ ప్రాంతంలో ప్రజా కోర్టు నిర్వహించి హత్య చేసారు మావోయిస్టులు. ఈ హత్యను ధ్రువీకరించిన భైరంఘడ్ ఏరియా కమిటీ మావోయిస్టులు.

ఈ మధ్య కాలంలో చతిస్గడ్ లో మావోయిస్టులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఓ వైపు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పలు సందర్భాల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు మరణించగా పోలీసులు గాయాల పాలవుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులను లేకుండా చేయాలని ఇటీవలే ఢిల్లీలో మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి పోలీసులు మావోయిస్టులను మట్టు పెట్టాలని పథకాలను రచిస్తున్నారు. పలువురు నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఇన్ ఫార్మర్ అని అనుమానంతో మావోయిస్టులు అతని చంపేశారు.

Read more RELATED
Recommended to you

Latest news