మార్చి 23 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

మార్చి 23 – ఫాల్గుణ మాసం – మంగళవారం.

 

మేషరాశి:ధన వృద్ధి కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన వృద్ధి కలుగుతుంది. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి.

పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభరాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి !

 

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీ మాట తీరు బాగ లేకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తుల కార్యాలయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువును నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. పెద్దవారిని గౌరవించక పోవడం వల్ల వారి మాటలను సూచనలను పాటించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారాలుః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకుని స్వామి వారికి ఆకుపూజ చేయించుకోండి.

 

మిధునరాశి:రుణ బాధలు తీరిపోతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధనయోగం కలుగుతుంది. స్నేహితులతో అయిన వారితో సంతోషంగా, సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం కలుగుతుంది. గతంలో ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 

కర్కాటకరాశి:అనవసర ఖర్చులు అధికమవుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. అవసరానికి డబ్బులు అందకపోవడం వల్ల ధననష్టం కలుగుతుంది. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. నష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పనిభారం పెరిగి పోతుంది.

పరిహారాలుః ఈ రోజు దుర్గాదేవిని ఆరాధించండి.

 

సింహరాశి:అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధనలాభం కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. వ్యాపార భాగస్వాముల వలన అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత విద్యలకు అర్హులవుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ప్రమోషన్లు పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. గృహంలో ఏదో ఒక శుభకార్యాన్ని తలపెడతారు. అనారోగ్యానికి దూరంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు.

పరిహారాలుః  శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

 

తులారాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. కష్టేఫలిగా ఉంటుంది. అత్యధిక శ్రమ వల్ల అంతా బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

పరిహారాలుః ఈరోజు మరకత లక్ష్మీ గణపతిని ఆరాధించండి.

 

వృశ్చిక రాశి:ధననష్టం కలుగుతుంది !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. ఏదో తెలియని ఇబ్బందులు, అవమానాలు ఎదురవుతాయి. ధననష్టం కలుగుతుంది. వాహన ప్రయాణం ప్రమాదాలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు విషయంలో నిగ్రహశక్తి కోల్పోతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురౌతాయి. స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి, దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి బెల్లము నువ్వుల నివేదన సమర్పించండి.

 

ధనస్సు రాశి:ధనలాభం కలుగుతుంది !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. ధనలాభం కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. అందరితో సంతోషంగా సఖ్యత ఉంటారు. సోదరులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. నీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబసౌఖ్యం ని పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత కళాశాలల్లో ప్రావీణ్యత పొందుతారు. అయినా వారి ఆదరణ పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. స్థిరాస్తులు అనుకూలిస్తాయి.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మకరరాశి:కార్యాలయాల్లో అనుకూలత !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ప్రాజెక్ట్ వర్క్ చేపడతారు. వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని బాగుంటారు. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. సోదరులతో సఖ్యత గా ఆనందంగా ఉంటారు. కుటుంబసౌఖ్యం ని పొందుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ గంగా పర్వత వర్దిని అమ్మవారిని ఆరాధించండి.

 

కుంభరాశి:ఖర్చులను తగ్గించుకుంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటారు. తల్లిదండ్రుల ఆస్తులు అనుకూలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. స్నేహితుల సహకారం పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి.

పరిహారాలుః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

మీన రాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. సమస్యల నుంచి బయటపడతారు. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు.  నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. అయినా వారి ఆదరణ పొందుతారు.

పరిహారాలు: అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news