పార్లమెంట్ లో మహిళా ఎంపీకి యాసిడ్ బెదిరింపు ?

Join Our Community
follow manalokam on social media

లోక్ సభ లాబీల్లో మహిళా ఎంపీ మీద యాసిడ్ పోస్తామని ఎంపీ ని బెదిరించిన ఘటన సంచలనంగా మారింది. ఈ మేరకు శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మీద లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు అమరావతి ఎంపీ నవనీత్ కౌర్. సచిన్ వాజే కేసులో జోక్యం చేసుకోవద్దని బెదిరించారని ఆమె ఫిర్యాదు చేశారు. జోక్యం చేసుకుంటే యాసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తున్నారు అని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇక స్పీకర్ తో పాటుగా ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రికి కూడా ఆమె లేఖ పంపారు.

ఆమె ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తిన నేపధ్యంలో సావంత్ లోక్ సభ లాబీలో ఆమెను బెదిరించారట, మీరు మహారాష్ట్రలో ఎలా తిరుగుతారో నేను చూస్తాను” అని అన్నారని నవనీత్ ఆరోపించారు. రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ 100 కోట్ల రూపాయల వసూలు లక్ష్యాన్ని నిర్దేశించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బీర్ సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేయడంతో లోక్ సభలో నవనీత్ వాజ్ అంశాన్ని లేవనెత్తారు. 

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...