మార్చి 24 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ మార్చి 24 – ఫాల్గుణ మాసం – బుధవారం

మేషరాశి:వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అవమానాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు. సోదరుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. దంపతుల మధ్య చికాకులు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. ఆటంకాలు ఎదురవుతాయి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల నష్టపోతారు.
పరిహారాలుః ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి:బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చిట్టి డబ్బులు అందుతాయి. వృద్ధి కలుగుతుంది. కుటుంబసభ్యులతో అందరితో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. కొత్త ప్రయోగాలు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధునరాశి:ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది.

విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొంటారు,ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. రుణ బాధలు తీరిపోతాయి. ఇతరులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు.  అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పరిహారాలుః దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

కర్కాటకరాశి:సోదరులతో ఆనందంగా ఉంటారు !

ఇలాగే సంతోషకరంగా ఉంటుంది. ఏ పని చేసిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందుతారు. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉన్నత విద్యలకు అర్హులవుతారు. సోదరులతో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. సోదరులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు.
పరిహారాలుః ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

సింహరాశి:ధననష్టం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఏర్పడడం వల్ల నష్టం కలుగుతుంది. పెద్ద వారిని గౌరవించక పోవడం వల్ల, వారి మాటలను సూచనలు పాటించకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు పనికి రాని విషయాల మీద ఆసక్తి చూపిస్తారు. మీలో ఉన్న కోపం చికాకుల వల్ల నష్టం కలుగుతుంది.
పరిహారాలుః ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేయండి. పేదవారికి అన్నదానం చేయండి.

కన్యారాశి:ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధనయోగం కలుగుతుంది. స్నేహితులతో సంతోషంగా, ఆనందంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు.
పరిహారాలుః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

తులారాశి:ఖర్చులు అధికమవుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల నష్టపోతారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువులో అశ్రద్ధ చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి.
పరిహారాలుః ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

వృశ్చిక రాశి:ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. ఎవరికి డబ్బులు ఇవ్వడం తీసుకోవడం చేయకండి. దీనివల్ల ఇబ్బందులు కలుగుతాయి. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల నష్టం కలుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో ఆశ్రద్ధ చూపుతారు.
పరిహారాలుః ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.

ధనస్సురాశి:సోదరులతో విభేదాలు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. ఇతరులకు మాట ఇచ్చి తప్పుతారు. ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలించవు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి:వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. తల్లిదండ్రులు విద్యార్థులు కష్టపడి చదివి ఉంటారు. వ్యాపారాలు అధిక లాభాలు కలుగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. నూతన గృహానికి కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కుంభరాశి:మిత్ర లాభం కలుగుతుంది !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ముఖ్యమైన విషయాల్లో మిత్రుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు.
పరిహారాలుః ఈ రోజు శ్రీ లలితా కాళీ పారాయణం చెప్పండి.

మీనరాశి:ధననష్టం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. మీ మాట తీరు బాగలేక ఇబ్బందులు కలుగుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. ఎదుటివారిని దూషణ చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా స్వల్ప నష్టాలు కలుగుతాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు.
పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news