వేసవికాలం వచ్చేసింది. ఈ మండే వేసవిలో అందరికీ నచ్చే పండు ఒకే ఒక్కటి. మామిడి పండు. మామిడి పండ్లకి రాజుగా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఐతే మామిడి పండుని జ్యూస్ లాగా లాగడం కంటే డైరెక్టుగా పండుని కోసుకుని తినడమే మంచిదట. దానివల్ల బరువు పెరగకుండా ఉంటారు. మామిడి పండ్లే కాదు మామిడి ఆకులు కూడా ఏ విధంగా మేలు చేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
శ్వాస సంబంధిత వ్యాధులు
మామిడి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడి ఆకులు ఉబ్బసం వ్యాధినుండి బయటపడేస్తాయి. ఉబ్బసంతో బాధపడేవారు మామిడి ఆకుల ప్రయోజనాన్ని ఈ విధంగా పొందవచ్చు. మామిడి ఆకులని నీటిలో ఉడకబెట్టి అందులో తేనె వేసి తాగితే సరిపోతుంది. దీనివల్ల ఉబ్బసం నుండి ఉపశమనం లభిస్తుంది.
కాలిన గాయాల నుండి ఉపశమనం
మీ చర్మం కాలిపోయిన ప్రదేశంలో మామిడి ఆకులను ఉంచండి, ఇది చర్మాన్ని త్వరగా సరిదిద్దడంలో సహాయపడుతుంది. మంటను తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
అలసటను తొలగించండి
శరీర అలసటను తొలగించడానికి మామిడి ఆకులు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దీని కోసం స్నానం చేసే నీటిలో మామిడి ఆకులను వేస్తే సరిపోతుంది. దానివల్ల అలసట తొలగిపోయి ఎనర్జీ వస్తుంది.
కడుపులో ఉన్న విష పదార్థాలను బయటకి పంపించి వేస్తుంది
కడుపు నొప్పి, మంట తదితర సమస్యలతో మీరు బాధపడుతున్నప్పుడు మామిడి ఆకులు మీకు బాగా మేలు చేస్తాయి. మామిడి ఆకులని ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని నీటిలో కలుపుని తాగడం వల్ల కడుపు శుభ్రం అవుతుంది. అంతే కాదు మలబద్దకం సమస్య మాయమవుతుంది.