పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందట. ఇది పరిశోధకులు చెబుతున్న మాట. ఒంటరిగా ఉంటున్న వారితో పోలిస్తే వైవాహితులకు గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మతిమరుపు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువని, ఎక్కువకాలం జీవిస్తారని చెబుతున్నారు. ఇంకా వారి అధ్యయనాల్లో చాలా విషయాలు వెల్లడయ్యాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి చేసుకోవడం. స్నేహితులు, సామాజిక సంబంధాలు కలిగి ఉండడంపై బ్రిటన్ పరిశోధకులు ఇటీవల సర్వే జరిపారు.
అనేక రుగ్మతలతో బాధపడుతున్న వారిలో ఒంటరిగా ఉన్నవారు.. వివాహితుల మధ్య వేరువేరుగా జరిపిన సర్వేలో అనేక విషయాల్లో వ్యత్యాసాలు ఉన్నట్టు వెల్లడించారు. 50- 70 ఏళ్ల వయస్సున్న వారిపై జరిపిన పరిశోధనలో ఒంటరిగా ఉన్న వారి కంటే వివాహితులే 16 శాతం ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు. అలాగే మతిమరుపు, డిమెన్షియా సమస్యలు తక్కువని కనుగొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారిలో వివాభితెలు తిందకగా కోలుకుంటున్నారని, ముఖ్యంగా గుండెపోటుకు దారితీసే అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ నియంత్రణకు వివాహం మంచి మందులా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వివాహ బంధంలో కనిపించే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు తీసుకునే శ్రద్ధ వల్ల మానసిక ఆరోగ్యంగా ఉంటారని తద్వారా గుండెనొప్పి, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఒంటరిగా ఉన్న వారి కంటే తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. అలాగే బ్రిటన్‌లోని లౌబరో విశ్వవిద్యాలయం పరిశోధకులు కూడా 6677 మందిపై అధ్యయనం చేసి ఇదే విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. వివాహంతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్, సామాజిక బంధుత్వాలు కూడా ఆరోగ్యంగా జీవించేందుకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.