మారుతీ రావు కేసులో బయటపడిన సెన్సేషనల్ నిజం – అతను చావుకి,  ప్రణయ్ చావుకి కారణం ఒకటే !

-

తన కూతురిని పెళ్ళి చేసుకున్నాడని దళితుడైన అల్లుడిని చంపేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన మారుతీ రావు….అగ్ర కులానికి చెందినవాడు. అతనికి అమృత అనే కూతురు ఉండటం జరిగింది. చిన్ననాటి నుండి అమృత నీ చాలా గారాలపట్టి గా పెంచిన మారుతీ రావు… కూతురు పెళ్లి విషయంలో కులం గోడలు అడ్డురావడంతో కూతురు ప్రేమించిన దళితుడిని అడ్డంగా కిరాయి గూండాల చేత నరికి చంపించడం అప్పట్లో సెన్సేషనల్ న్యూస్ గా నిలిచింది. Image result for pranay maruthi raoఆ కేసులో మారుతీ రావు జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్ మీద విడుదల అవ్వటం…తాజాగా ఆయన ఆత్మహత్య చేసుకోవటం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మీడియాలో ఈ వార్త హైలెట్ అయ్యింది. దీంతో మారుతీరావు మరణం పట్ల చాలామంది..అల్లుడు “గుణం, నమ్మకం, మనిషి తత్వం, చివరికి ధనం” చూసి ప్రేమను అంగీకరించాల్సిన మామ.., కులాన్ని గోడగా చూపి ఓడిపోయారు. ఆ కులమే బూచిగా చూపించి…, తండ్రి తనాన్ని ఇచ్చిన.., కూతురి భర్తని చంపించి మామగా మరణించారు.

 

కూతురి తర్వాత ఆమె కన్న బిడ్డకు తాతయ్యారు. ఆ బిడ్డని కూడా తక్కువ కులం వాడిగా చూసి.., పసిబిడ్డ సహా అన్నీ వదిలేసి కూతురును వచ్చేయమని బెదిరించి తాతగా ఓడిపోయారు. మనిషిగా అన్ని విధాల ఓడిపోయి చివరాకరికి తన ఆత్మ ని హత్య చేసుకున్నాడు. తక్కువ కులానికి చెందిన వాడితో నా కూతుర్ని ఇవ్వటమే అహంతో మారుతీ రావు చనిపోవడం పట్ల అందరూ ఒకటి అంటుంది కులం మరియు అహం మామ అల్లుళ్ళ చావుకు కారణం అని అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news