రాజ్యసభ నాలుగు పదవులు ఎవరికి ఇవ్వాలి అన్న దాని విషయంలో వైయస్ జగన్ తర్జన భర్జన పడుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రాజ్యసభలో నాలుగు స్థానాలు వైసీపీకి దక్కాయి. ఇప్పటికే రాజ్యసభ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వటంతో అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటువంటి తరుణంలో వైసీపీ పార్టీ తరఫున రాజ్యసభ కి వెళ్తున్న వారి పేర్లు మొన్నటి వరకు చాలా వినపడటం జరిగాయి. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో నామినేషన్ వేయాల్సిన పరిస్థితి రావడంతో వైయస్ జగన్ ఎవరిని రాజ్యసభకు పంపిస్తారో అన్న దాని విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నట్లు మొన్నటివరకు వార్తలు వచ్చాయి.
కాగా నాలుగు లో ఒక స్థానం మాత్రం మండలి రద్దు విషయంలో తనకు అండగా నిలబడి పార్టీకి పూర్తిగా విధేయులుగా వ్యవహరించిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఈ ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా రాజ్యసభ స్థానం ఇవ్వాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇటీవల వైయస్ జగన్ తన ఛాంబర్ కి వాళ్ళిద్దరినీ పిలిచి ‘ రాజ్యసభ సీటు మీ ఇద్దరిలో ఎవరికి కావాలో మీరే డిసైడ్ అవ్వండి ‘ అని అన్నట్లు వైసిపి పార్టీ లో టాక్ నడుస్తుంది. ఇద్దరూ కూడా తనకి కీలకమైన సమయంలో అండగా ఉండటంతో జగన్ ఈ నిర్ణయం వాళ్ళిద్దరికీ వదిలేసినట్లు వార్తలు వినబడుతున్నాయి.