వ్యాక్సిన్ కంటే మాస్క్ బెస్ట్…?

-

న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక కథనంలో ప్రస్తావించిన ఒక కామెంట్ ఆసక్తికరంగా మారింది. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి యునివర్సిల్ మాస్కింగ్ ఒక్కటే వ్యాక్సిన్ కి ప్రత్యామ్నాయం అని, వ్యాక్సిన్ వచ్చినా సామర్ధ్యం చెప్పలేమని పేర్కొంది. కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు ప్రత్యామ్నాయంగా యూనివర్సల్ ఫేషియల్ మాస్కింగ్‌ను శాస్త్రవేత్తలు కూడా సమర్ధిస్తున్నారు.

కొన్ని కేస్ స్టడీస్ కూడా కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటంలో మాస్క్ లు ధరించడమే మంచిది అనే విషయాన్ని చెప్తున్నాయి. స్పానిష్ ఫ్లూ సమయంలో కూడా మాస్క్ లే కీలక పాత్ర పోషించాయని చెప్పారు. కేసులు ఇంకా భారీ సంఖ్యలో పెరుగుతున్న భారతదేశంలో, యూనివర్సల్ మాస్కింగ్ మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది పేదలకు మాస్క్ లు లేవని కథనంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news