రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ పై తెలంగాణ బీజేపీ కీలక నేత, ఎంపీ ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు.
మంగళవారం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ లో ఈటల పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారిపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనపై చేయిచేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇవాళ పలానా ప్రాంతానికి వెళుతున్నానని స్థానిక మంత్రి, పోలీసులకు చెప్పి వచ్చాను.
“నేను ఇక్కడకు వచ్చాక కూడా పేదలను గుండాలు బెదిరించే ప్రయత్నం చేశారు. ఎంపీకి చెప్తారా మీ
సంగతి చెప్తాం అని బెదిరించారు. అసలు పోలీసులు ఎవరికి మద్దతు తెలుపుతున్నారు. రోజు
రోజుకూ పోలీసులు గౌరవం పోగొట్టుకుంటున్నారు. ప్రజలకు పోలీసులు రక్షణ కల్పించకపోతే.. ఆ
బాధ్యత కూడా మేమే తీసుకొని గుండాలను తరిమి వేస్తాం” అని ఈటల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ చుట్టుపక్కల పేదల ఖాళీ స్థలాలను పోలీసులు, రెవెన్యూ అధికారుల అండ దండలతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జాలు చేస్తున్నారు. పేదలపై దౌర్జన్యం చేస్తున్నారు.