రవితేజ కోరుకున్న హిట్ వచ్చిందా, లేదా.!

-

రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న చిత్రం ధమాకా,నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్  మూవీ ఈ శుక్రవారమే విడుదల అయ్యింది. సినిమా కోసం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ నడుస్తోంది.

‘ధమాకా’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాలంటే రూ.19.00 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందిన ఈ సినిమా  కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. తాజాగా ఫస్ట్ డే కలెక్షన్లని ప్రకటించింది సినిమా యూనిట్‌.ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో పది కోట్లకుపైగా ఓపెనింగ్స్ ని రాబట్టినట్టు వెల్లడించారు. సుమారు 11కోట్ల గ్రాస్‌, 7కోట్ల షేర్‌ని రాబట్టినట్టు తెలుస్తుంది.

ఏంతో కాలంగా మాంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవి తేజ కు హిట్ వచ్చినట్లే అని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ సినిమా కోసం రవితేజ డాన్స్ కోసం కూడా కష్టపడ్డాడు. ఇక యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా ఉండటం తో చాలా చోట్ల యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. ఈ సినిమా అంతిమ ఫలితం రావాలంటే వారం రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news