చిక్కుల్లో పడ్డ మాస్ మహారాజా రవితేజ..!

-

ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయి తెలుగు చిత్ర పరిశ్రమలో అసలుసిసలైన మాస్ హీరో ఇమేజ్ సంపాదించుకున్న రవితేజ ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలతో తెరమీదికి వచ్చినప్పటికీ సరైన విజయం మాత్రం సాధించలేకపోతున్నారు. ఇక ఇటీవలే తన హిట్ కాంబినేషన్ అయినా గోపీచంద్ మలినేని తో ప్రస్తుతం క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఇక ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని… 2021 సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది

కానీ ప్రస్తుతం రవితేజ నటించిన క్రాక్ సినిమాకు లీగల్ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ అయోమయంలో పడిపోయాడు. ఈ సినిమాకు సంబంధించిన తమిళ డిస్ట్రిబ్యూషన్ కోర్టుకు వెళ్లడంతో లీగల్ చిక్కుల్లో పడింది ప్రస్తుతం క్రాక్ సినిమా. సినిమా రిలీజ్ ఆపేందుకు కోర్టు స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలైంది. విశాల్ హీరోగా తమిళంలో ఈ సినిమా తెరకెక్కింది. అక్కడ ఆఫీస్ వద్ద బోల్తా పడింది ఈ సినిమా. అయితే తమిళ సినిమా నిర్మాత ఠాగూర్ మధు పై ప్రస్తుతం తమిళ డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకెక్కడంతో.. తెలుగు చిత్ర పరిశ్రమలో క్రాక్ విడుదలకు ప్రస్తుతం అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news