ఏపీ : రేపు టాయిలెట్స్ డే నిర్వహించాలని ఉపాధ్యాయులకు, పేరెంట్స్ కమిటీలకు మెసేజ్ లు…!

-

రాష్ట్ర విద్యాశాఖ నుండి వింత మెసేజ్ లు వస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు విచిత్ర సర్క్యులర్లు జారీ చేస్తున్నారు. రేపు ప్రపంచ టాయిలెట్ల డే నిర్వహించాలని పాఠశాల ఉపాధ్యాయులకు, పేరెంట్స్ కమిటీలకు ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. పాఠశాలల హెడ్ మాస్టర్ లు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాఠశాలల్లో టాయిలెట్లు కడగాలని ఆదేశాలు జారీచేయడం ఇప్పుడు వివాదాలకు దారి తీస్తోంది.

టాయిలెట్ల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా టాయిలెట్లు కడగటం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం టాయిలెట్ల క్లీనింగ్ లో పాల్గొనాలంటే ఆప్షనల్ హాలిడే ని రద్దు చేసినట్లేనని ఏపీటీఎఫ్ చెబుతోంది. విద్యాశాఖ అధికారుల పై ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సర్క్యులర్ లను, ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news