బ్రేకింగ్ ; ఈ నెల 26వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సమయాన్ని పొడగించింది ప్రభుత్వం.  ఈ నెల 26 వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన  బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పక్షాల డిమాండ్‌ ను కూడా జగన్‌ సర్కార్ పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రతి పక్ష టీడీపీ పార్టీ…  15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం  ఈ నెల 26 వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తేల్చి చెప్పింది.  మొదట ఇవాళ ఒక రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని జగన్‌ సర్కార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ… ఈ నెల 26 వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌.