దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలలో భారీగా మార్పు చేసుకుంది. కొన్ని నగరాల్లో ధరలలో ఎలాంటి మార్పుల లేదు కాని మరి కొన్ని నగరాల్లో భారీగా పెరిగాయి. మరి కొన్ని నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రభావం బంగారం ధరల పడిందని చెప్పవచ్చు.
కాగ బంగారం ధరలకు ఎంత రెక్కలు వచ్చినా.. వాటి కొనుగోలు మాత్రం పడిపోవు. రోజు రోజు కు బంగారం వినియోగం పెరుగుతూనే ఉంటుంది. మన తెలుగు రాష్ట్ర ల నుంచి హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. కానీ ఒక్క ముంబయి నగరంలోనే 10 గ్రాముల బంగారం పై రూ.810 పెరిగింది. కాగ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడం తో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ రోజు దేశంలో ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,110 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210గా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,110 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,260 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,560 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,030 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,030 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,110 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,210 గా ఉంది.
కోలక్తత నగంరలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,510 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,210 గా ఉంది.