హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ కంపెనీ.. వెయ్యి కోట్లతో !

హైదరాబాద్ నగరానికి మరో వెయ్యి కోట్ల పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్ నగరంలో తమ గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నామని ప్రముఖ ఆర్థిక సేవలు మరియు భీమా సంస్థ మాస్ మ్యూచువల్ కంపెనీ ప్రకటించింది. లక్షా యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో కంపెనీ తమ గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ ని ప్రారంభించనుంది. ఇప్పటికే 300 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్న కంపెనీ… భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు అందించే అవకాశం కూడా ఉంది.

ప్రపంచంలోని అనేక నగరాల పరిశీలన తర్వాత హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నామని కంపెనీ తెలిపింది. ఇక్కడ అందుబాటులో ఉన్న టాలెంట్ పూల్ మరియు ప్రో యాక్టివ్ ప్రభుత్వ విధానాలే ఇందుకు ప్రధాన కారణం అని కంపెనీ పేర్కొంది. ఇక కంపెనీని హైదరాబాద్ నగరానికి మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ రోజు కంపెనీతో జరిగిన సమావేశంలో మంత్రి కే తారకరామారావు వారితో మాట్లాడి, ప్రభుత్వం అన్ని విధాలుగా కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలకి మద్దతు ఇస్తుందని తెలిపారు.