తొలి మ్యాచ్ లోనే మాక్స్ వెల్ కెప్టెన్సీ కి దెబ్బ !

-

ఈ రోజు నుండి ఆస్ట్రేలియా వేదికగా పురుషుల బిగ్ బాష్ లీగ్ 2023 – 24 సీజన్ మొదలైంది. ఈ రోజు కాసేపటి క్రితమే ముగిసిన మొదటి మ్యాచ్ లో మెల్బోర్న్ స్టార్స్ మరియు బ్రిస్బేన్ జట్లు తలపడగా, ఈ మ్యాచ్ ఏకపక్షము గానే ముగిసింది. మొదటగా బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ జట్టు నిర్ణీత ఓవర్ లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కివీస్ ప్లేయర్ మున్రో విద్వంసం సృష్టించాడు.. ఇతను ఇనింగ్స్ లో 61 బంతుల్లోనే 9 ఫోర్లు మరియు 5 సిక్సులు సహాయంతో పరుగులు చేసి ఒక్క పరుగు దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మెల్బోర్న్ స్టార్స్ కేవలం 111 పరుగుల కె కుప్పకూలడం విశేషం. వరల్డ్ కప్ లో భారీ డబుల్ సెంచరీ తో చెలరేగిన మాక్స్ వెల్ కెప్టెన్ గా ఉన్న స్టార్స్ జట్టు 103 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఈ మ్యాచ్ లో మాక్స్ వెల్ కెప్టెన్ గానే కాకుండా, ప్లేయర్ గానూ ఫెయిల్ అయ్యాయి ఓటమికి ప్రధాన కారణం అయ్యాడు.

బ్యాటింగ్ లో 23 పరుగులు చేయగా, బౌలింగ్ లోనూ పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ గా చేసిన మొదటి మ్యాచ్ లోనూ ఓటమి చెందడంతో మ్యాక్సీ అభిమానులు నిరాశపాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news