ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచి రోజు..

-

ఈ రోజు ఏ రాశి వారికి మంచి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..

మేషం

అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా కూడా మంచి ఫలితాలను అందుకుంటారు.ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.ఎప్పుడూ చేసిన కూడా జాగ్రత్తలు వహించాలి.వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి.దైవ దర్షనాలు చేస్తారు.

వృషభం

మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.చెడు సహవాసాలు చేయడం మానుకోవాలి.

మిథునం

నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు..ఈరోజు చాలా మంచి రోజు..అనుకున్న ఫలితాలు అందుకుంటారు.

కర్కాటకం

విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువంగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి.రుణ లాభాన్ని పొందుతారు.ఎప్పటి నుంచో ఉన్న మొండి బకాయిలు తీరతాయి.

సింహం

కుటుంబంలో కలహాలు తీరి మంచి ఫలితాలు వుంటాయి. ఇంటిల్లి పాధి సంతోషంగా ఉంటారు.ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు.దూర ప్రయాణాలు చేస్తారు.

కన్య

గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది.ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.విందు , వినొదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు..

తుల

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది..అనారోగ్య సమస్యలు బాధించవచ్చును. భారీగా ఖర్చులు పెరుగుతాయి.. జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం

ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు..రుణాలు లాభస్తాయి.కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి.మంచి రోజు.అనుకున్న పనులు పూర్తీ అవుతాయి.

ధనుస్సు

అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.సడెన్ గా ఖర్చులు అధికం అవుతాయి.జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మకరం

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండటంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. రుణ విముక్తి కలుగుతుంది.. ఈరోజు శ్రమ తగ్గుతుంది..

కుంభం

కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి.దూరపు బంధువుల తో సంతోషంగా గడుపుతారు..ప్రయాణాలు లాభిస్తాయి.

మీనం

ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. స్త్రీలకు చాలా మంచి రోజు..బాధలు పూర్తిగా తగ్గి పోతాయి.బంధు మిత్రులను కలుసు కుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news