మేడారంలో ఎన్ని వందల కోట్ల వ్యాపారం జరిగిందో తెలుసా…?

-

తెలంగాణా కుంభమేళాగా భావించే మేడారం జాతరలో భారీగా మార్కెట్ జరిగింది. మహాజాతర 4 రోజులు జరగగా… మొత్తం నెల రోజులపాటు ఈ జాతర ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఊహించని విధంగా మార్కెట్ జరిగింది. దాదాపు రూ.235 కోట్ల బిజినెస్ జరిగిందని అంచనా వేస్తున్నారు. నాన్ వెజ్ నుంచి మద్యం వరకు భారీగా ఈ ప్రాంతంలో ఊహించని విధంగా వ్యాపారం జరిగింది.

రూ.158 కోట్ల రూపాయల మాంసం వ్యాపారం జరిగినట్టు సమాచారం. రెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర కాబట్టి ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేసారు. ఈ జాతర్లో దాదాపు 2లక్షల మేకలు, గొర్లను బలిచ్చారు. అదే విధంగా 200 కోళ్ల షాపులకు అధికారులు అనుమతివ్వగా… మరో 200 షాపుల దాకా అనుమతులు లేకుండా విక్రయదారులు ఏర్పాటు చేసారు. ఈ షాపుల్లో 10లక్షల కోళ్ల వరకు అమ్ముడయ్యాయని అంటున్నారు.

మొత్తంగా రూ.130 కోట్ల విలువైన గొర్లు, మేకలు, రూ.28 కోట్ల విలువైన కోళ్లను విక్రయించారట. ఇక మద్యం విషయానికి వస్తే 38,250 కేసుల లిక్కర్‌, 11,037 కేసుల బీర్లను విక్రయించారు. వీటి విలువ దాదాపు రూ.4.59 కోట్లగా చెప్తున్నారు. ఈ సమయంలో రెట్టింపు ధరకు అమ్ముతారు కాబట్టి రూ.7.5 కోట్ల మద్యం అమ్ముడు అయిందని సమాచారం. నెల రోజుల పాటు మరో రెండు కోట్ల మధ్య౦ విక్రయించారు.

నాలుగు రోజుల పాటు మేడారం జాతరలో 35 లారీల్లోని 525 టన్నుల బెల్ల౦ విక్రయించారు. వీటితో పాటుగా గ్రామాల్లో మరో 275 టన్నుల బెల్లం గత నెల రోజులుగా మొక్కుల కోసం కొనుగోలు చేసారు. మొత్తం నెల రోజుల్లో పేరుతో 800 టన్నులకు పైగా బెల్ల౦ అమ్మకాలు జరిగాయి. కిలోకు రూ. 70 లెక్కేసినా రూ. 5.6 కోట్ల మేర బెల్లం వ్యాపారం జరిగింది. ఇలా కొబ్బరికాయలు, పూజా సామాగ్రీ చూసుకుంటే ఆ స్థాయిలో అమ్మకాలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news