వాలంటీర్ల మీద కక్ష సాధింపు కరెక్ట్ కాదు : సీపీఐ రామకృష్ణ

-

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన వాలంటీర్ వ్యవస్థపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆరోపిస్తున్నారు. ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సమయంలోనూ వాలంటీర్లు వైసీపీ పార్టీ కోసం పనిచేశారని, అందుకే చాలా మంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి మరీ ఆ పార్టీ కోసం పనిచేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందున్న విషయంపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. రూ. 5 వేల వేతనంతో పని చేసే వాలంటీర్స్ మీద కక్ష సాధింపు కరెక్ట్ కాదు. వాలంటీర్లు @YSRCParty వాళ్లు అంటున్నారు.. ఎలక్షన్స్ ముందు మీరు వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళకి #tdpలో టిక్కెట్లు ఇవ్వలేదా? అని సీపీఐ రామకృష్ణ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version