రెండవసారి కేరళ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పినరాయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మే 20 న ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయన 21 మంది సభ్యుల మంత్రివర్గం నుంచి వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కేకే శైలజని తప్పించారు. 21 మంది మంత్రులు కేబినేట్ లో ఉంటారని ఎల్‌డిఎఫ్ కన్వీనర్, సిపిఐ (ఎం) యాక్టింగ్ స్టేట్ సెక్రటరీ ఎ విజయరాఘవన్ తెలిపారు.
గత ప్రభుత్వం నుంచి కేవలం ఒక్క సిఎం మాత్రమే ఉంటారని 11 మంది యువకులు ఉంటారని ఆయన పేర్కొన్నారు. కొత్త కేబినెట్ గురించి సిపిఐ (ఎం) నాయకుడు ఎఎన్ షంసీర్ మాట్లాడుతూ ఇది పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అని ప్రకటించారు. కెకె శైలజ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో చాలా సమర్ధవంతంగా వ్యవహరించారు. 2020 లో, యుకెకు చెందిన ఒక పత్రిక ఆమెను ‘టాప్ థింకర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది . మాట్టన్నూర్ నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కెకె శైలజ పోటీ చేసి 61.97 శాతం ఓట్లు సాధించారు.