కోల్ కతాలో ఓ డాక్టర్ పై లైంగిక దాడి జరిగిన ఘటన దాదాపు అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా రేపటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కొన్ని ఎంపిక చేసినటువంటి సేవలను నిలిపి వేస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ నిరసన ద్వారా అత్యవసర సేవలను మినాహాయిస్తున్నట్టు పేర్కొంది.
కోల్ కతాలో వైద్యురాలి పై జరిగిన లైంగిక దాడి ఘటనకు నిరసనగా ఈ నిర్నయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర, ఆరోగ్య మంత్రి జే.పీ.నడ్డాకు ఓ లేఖ రాసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. వైద్యులకు భద్రత కల్పించాలని కోరింది. ప్రాణాలు కాపాడే డాక్టర్లకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సామాన్యుడి పరిస్థితి మరేలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండి వైద్యులు తమ ప్రాణాలను కాపాడుకుంటే బెటర్.