కాళేశ్వరం లాగా.. కేసీఆర్‌ నిర్మించినవి అన్ని కూలిపోతున్నాయి – మంత్రి ఉత్తమ్‌

-

కాళేశ్వరం లాగా.. కేసీఆర్‌ నిర్మించినవి అన్ని కూలిపోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్‌. సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్‌ రన్‌ ప్రారంభించిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. 15 న సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మూడు పంపులు ఆన్ చేస్తామని… రెండో, మూడో స్టేషన్ ల వద్ద ఆన్ చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని… సీతారామ గతం లో అనుమతులు లేవని వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం ను ఒప్పించామని… నెలాఖరు లోపు లో గోదావరి జలాల 65 టిఎంసి అనుమతి వస్తుందని పేర్కొన్నారు. సాగర్ నీళ్లు రానప్పుడు గోదావరి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు అందిస్తున్నామన్నారు. లక్ష 20 వేల ఎకరాలు స్థిరీకరణ అందనుందని తెలిపారు. నామ మాత్రం ఆయకట్టు ను మాత్రమే గత ప్రభుత్వం చేసిందని… సీతారామను అసలు గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహించారు మంత్రి ఉత్తమ్‌.

Read more RELATED
Recommended to you

Latest news