మెడికల్ వండర్: వృద్ధుడి శరీరంలో 1364 రాళ్లు… ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు !

కోల్కతా లో డాక్టర్స్ ఒక అరుదైన ఆపరేషన్ చేసి ఒక వృద్ధుడి ప్రాణాలను కాపాడిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి వివరాల ప్రకారం కొద్ది రోజుల నుండి కడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఒక వృద్ధుడు హాస్పిటల్ కు వెళ్లగా స్కానింగ్ చేసిన వైద్యులు షాక్ తిన్నారు. ఆ వృద్ధుడి కడుపులో ఉన్న గాల్ బ్లాడర్ లో 1364 రాళ్లు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. దీనితో వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం అని తెలియచేయడంతో, ఆపరేషన్ స్టార్ట్ చేసిన వైద్యులు దాదాపుగా 45 గంటల పాటు ఎంతో కష్టపడి వృద్ధుడి కడుపులో ఉన్న 1364 రాళ్లను తొలగించారు. ఈ రాళ్లు కనుక సమయానికి తొలగించకుండా, అవి కనుక పిత్తాశయ వాహికలోకి వెళ్లి ఉంటే చాలా ప్రమాదమని వైద్యులు తెలియచేశారు. ఈ ఆపరేషన్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు..

మాములుగా అయితే ఒక మనిషి కడుపులో కణితి లేదా కొద్ది పాటి రాళ్లు ఉండడం చాలా సంఘటనలు విని ఉంటాము. ఇది మాత్రం చాలా అరుదుగా జరిగే ఘటన… ఆపరేషన్ సక్సెస్ కావడం వలన ఆ వృద్ధుడు ప్రాణాపాయం నుండి బయటపడినట్లే.