చంద్రబాబుది అక్రమ అరెస్ట్ కాబట్టే జాతీయ నాయకులు స్పందించారు – బుద్ధా వెంకన్న

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సంచలనంగా మారిందని అన్నారు టిడిపి నేత బుద్ధా వెంకన్న. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుది అక్రమ అరెస్టు కాబట్టే జాతీయ స్థాయి నాయకులు స్పందించారని అన్నారు. సీఎం జగన్ తన కంపెనీలోకి డబ్బులు మళ్లించి పక్కా సాక్షాదారాలతో దొరికారని విమర్శించారు. తనను జైలుకు పంపించారనే జగన్ చంద్రబాబు పై కక్ష పెంచుకున్నారని అన్నారు. జగన్ నుంచి 42 వేల కోట్ల రూపాయల ఆస్తులను ఈడి జప్తు చేసిందని.. తనను దొంగ అని జైలుకు పంపించారని జగన్ కక్షపెంచుకున్నారని మండిపడ్డారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పై పెట్టిన సెక్షన్లు సరైనవి కాదని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరగలేదని సంస్థ చైర్మన్ ఓపెన్ గా ప్రకటించారని తెలిపారు. నేడు న్యాయ వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తున్నారని.. చంద్రబాబు కేసు విషయంలో న్యాయమూర్తి సరైన తీర్పు ఇవ్వలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని అన్నారు.