సీఎంల భేటీ హర్షణీయం :దగ్గుబాటి పురందేశ్వరి

-

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సీఎంల భేటీ హర్షణీయం అని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి ఆస్తులు, అప్పులు పంపకాలకు పరిష్కారం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎంలు నేరుగా భేటీ కావడం వలన అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. రాష్ట్ర విభజన ఆస్తులు, అప్పులు పంపకాలకు సంబంధించి కేంద్రం ఇంతకుముందే కమిటీ వేసిందని.. కమిటీలు చర్చించే కంటే సీఎంలు భేటీ కావడం పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని అన్నారు.

కాగా.. సుదీర్ఘ కాలంగా తెలంగాణ , ఏపీ రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగనుంది. షెడ్యూల్ 9, 10 లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తుల పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ తరుఫున చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులు జనార్ధన్ రెడ్డి,అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ చర్చల్లో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version