హైదరాబాద్ లోని ఖాజాగుడా లో మెగా వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించారు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి రోజు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు వ్యాక్సిన్ డ్రైవ్ జరుగుతుందని.. ఎవరు ఎక్కువ సేపు వేయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇంత కాలంగా వ్యాక్సిన్ ఇస్తున్నామని.. ఎక్కడా తీవ్ర అనారోగ్యాలకు ఎవరు గురి కాలేదని పేర్కొన్నారు.
ఖాజాగుడా ప్రాంతలో ఎక్కువగా నిర్మాణాలు జరుగుతున్నాయని.. మైగ్రేషన్ సిబ్బంది ఎక్కువగా పని చేస్తుంటారని వెల్లడించారు. మైగ్రేషన్ వర్కర్ లకు ఇది బాగా ఉపయోగ పడుతుందన్నారు. 2.8 కోట్ల డోస్ లు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ చేసామని చెప్పారు. వచ్చే నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100% మొదటి డోస్ పూర్తి చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ లు ఏర్పాటు చేస్తున్నామని.. వాక్సినేషన్ తక్కువగా జరిగిన ప్రాంతాల్లో కలెక్టర్ లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామన్నారు సీఎస్ సోమేశ్ కుమార్.