ఢిల్లీలో పాకిస్తాన్ ఉగ్ర‌వాది అరెస్ట్‌..

దేశ రాజధాని ఢిల్లీలో.. ఉగ్రవాదుల కుట్ర ను పోలీసులు భగ్నం చేశారు. రాజధాని ఢిల్లీలో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ ఉగ్రవాదిని మంగళవారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుడి నుంచి ఏకే-47 సహా గ్రేనెడ్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతేకాదు పాకిస్థాన్లోని పంజాబ్ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఆ ఉగ్రవాదిని గుర్తించారు పోలీసులు. ఢిల్లీలోని లక్ష్మీ నగర్ లో పాకిస్థాన్ దేశానికి చెందిన అష్రఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇండియాకు చెందిన నకిలీ గుర్తింపు కార్డులతో అష్రఫ్ ఢిల్లీలో మకాం పెట్టినట్లు గుర్తించిన పోలీసులు… అతడి నుంచి ఏకే-47తో పాటు 60 రౌండ్ల బుల్లెట్లు, 50 రెండు అధునాతన గన్స్ ను సీజ్ చేశారు. అలాగే కే.వి నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు ఉంటున్నా లక్ష్మీ నగర్ లోని ఏరియాలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. దసరా పండుగ నేపథ్యంలో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమనిస్తున్నారు. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.