మెగాస్టార్ చిరంజీవి వయసు పైబడుతున్న కుర్ర హీరోలతో పోటీగా ఫలితంతో సంబందం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి నుండి వాల్తేరు వీరయ్య మరియు భోళా శంకర్ లు రిలీజ్ కాగా.. ఒకటి హిట్ మరొకటి ఫట్ అయింది. ఇక మెగాస్టార్ తన 156వ సినిమాపై దృష్టిని పెట్టాడు. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సరైన టైములో కళ్యాణ్ రామ్ కు అందించిన మల్లిడి వశిష్ట చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నాడు. కథా చర్చలు అన్నీ అయిపోయాక సెట్స్ మీదకు వెళ్లానని నిర్ణయించుకున్నారు చిత్రబృందం. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కోసం చిత్రబృందం పరిశీలనలో ఉన్నారట. ఈ సినిమాకు “విశ్వంభర” అనే టైటిల్ ను బలంగా అనుకుంటున్నారట.. ఇది ఒక సోసియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
కానీ ఈ టైటిల్ ను మొదటగా రామ్ చరణ్ శంకర్ కంబోలో వస్తున్న గేమ్ చేంజర్ కు అనుకున్నారట. కానీ టైటిల్ సెట్ అవకపోవడంతో పక్కన పెట్టేశారు. ఇప్పుడు చిరు మూవీకి సెట్ చేస్తున్నారు.. కానీ ఇంకా అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన లేకపోవడంతో నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్.