చిరు వ్యాఖ్యలు పవన్ ఇమేజ్ కు ప్లస్ కానున్నాయా…..??

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తమ ఫ్యామిలీ ఫంక్షన్స్ తో పాటు ఎవరైనా ఇతరులు తమ సినిమాల ఫంక్షన్లకు ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్లి వారికి తన వంతుగా మద్దతు అందిస్తూ ఉంటారు. ఆ విధంగా నిన్న నిఖిల్ హీరోగా తెరకెక్కిన అర్జున్ సురవరం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి, ఆ ఫంక్షన్ లో సినిమా యూనిట్ తో పాటు ఫ్యాన్స్ లో కూడా మంచి జోష్ ని నింపారు అని చెప్పాలి. ఇక ఫంక్షన్ మధ్యలో హీరో నిఖిల్, మెగాస్టార్ నటించిన పలు హిట్ సాంగ్స్ కు డాన్స్ చేసి స్టేజిని అదరగొట్టడం జరిగింది. ఆ సాంగ్స్ కు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. ఇకపోతే చివరిలో మెగాస్టార్ మాట్లాడుతూ, తనకు నిఖిల్ తో పెద్దగా పరిచయం లేదని,

అయితే ఈ సినిమాను చూసిన తనకు, ఇటువంటి మంచి సినిమాకి తనవంతు సాయం అందిస్తే బాగుంటుందని ఈ ఫంక్షన్ కి తానే స్వయంగా నిర్మాతలను కోరి రావడం జరిగిందని అన్నారు. ఇక ఈ సినిమాలో మంచి ఇన్స్పిరేషనల్ గా మరియు పవర్ఫుల్ గా సాగె చేగువేరా సాంగ్ ని శంకర్ మహదేవన్ ఆలపించచడం జరిగింది. ఫంక్షన్ మధ్యలో ప్రదర్శింపబడిన ఆ సాంగ్ గురించి మెగాస్టార్ మాట్లాడుతూ, తనకు ఎంతో ఇష్టమైన శంకర్ మహదేవన్ గారు పాడిన ఆ పాటను వింటుంటే తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని,

అలానే ఆ పాట వింటున్నంతసేపు తనకు తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చాడని అన్నారు. అంతేకాక పవన్ సిగ్నేచర్ స్టైల్ ను స్టేజి పై ఇమిటేట్ చేసిన మెగాస్టార్, తన తమ్ముడి పై తనకు ఎంతో నమ్మకం ఉందని, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా పవన్ సహించలేడని, అతడి నిజాయితీనే అతనికి మంచి భవిష్యత్తుని అందిస్తుందని చెప్పడం జరిగింది. అయితే మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు, ఒకింత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ కి మంచి చేసేవేనని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిన్నటి ఫంక్షన్ మొత్తం కూడా మెగా నామ జపంతో సాగింది. కాగా అర్జున్ సురవరం సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version