ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఈ వాస్తు చిట్కాలను పాటించండి..!

-

వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన హ్యాపీగా ఉండొచ్చు. ఏ ఇబ్బందులు కూడా రావు. నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని అందుకుంటారు. చాలా మంది ఆర్థిక సమస్యల వలన ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా ఆర్థిక సమస్యల వలన ఇబ్బంది పడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని ఫాలో అవ్వండి. ఇలా చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు. ఇబ్బందులు కూడా రావు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమని గుర్తు పెట్టుకోండి. ఆగ్నేయం వైపు చెత్తాచెదారం లేకుండా చూసుకోవడం వలన లక్ష్మీదేవికి సంతోషం కలిగి మీ ఇంట కొలువై ఉంటుంది. అలాగే డబ్బులు బాగా రావాలంటే ఇంట్లో ఒక మనీ ప్లాంట్ ని పెట్టుకోండి. ఇది కూడా ఆగ్నేయం వైపు ఉంటే మంచిదని గుర్తు పెట్టుకోండి.

గురువారం నాడు అనాధలకి దానం ఇవ్వడం చాలా మంచిది. ఆహారం, బట్టలు లేదంటే డబ్బులు ఇవ్వచ్చు. ఇలా చేయడం వలన కూడా లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి స్నానం చేశాక సూర్యుడికి నీటిని ఇవ్వండి. ఇలా చేయడం వలన డబ్బు బాగా వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ఇంటి లివింగ్ రూమ్ లేదా ముఖద్వారం ఎదురుగా లాఫింగ్ బుద్ధా పెట్టాలి. అలా చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చక్కగా డబ్బులు వస్తాయి.

కుబేర మంత్రాన్ని చదివితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడచ్చు. శుక్రవారం నాడు కుబేర మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి దీనిని ప్రతి శుక్రవారం రిపీట్ చేస్తూ ఉండండి. అప్పుడు మీ పరిస్థితులు మారిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి సంతోషంగా ఉండొచ్చు. పాజిటివ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంటి వాతావరణం కూడా పాజిటివ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ ఉంటే లక్ష్మీదేవి కచ్చితంగా అక్కడే ఉంటుంది. ఇవన్నీ పాటించడంతో పాటుగా డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. డబ్బుని బాగా విపరీతంగా ఖర్చు చేయడం లేకపోతే అనవసరంగా వృధా చేయడం, అవమానించడం మంచిది కాదు. డబ్బుని గౌరవించాలి. అలాగే చూసి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version