`కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` సినిమా ఆ తండ్రీ కొడుకులకు అంకిత‌ం – వర్మ

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తాజాగా ఈయన తన శిష్యుడు..సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. కులాల మధ్య అంతరాన్ని పెంచేలా టైటిల్ ఉందంటూ కోర్టులో కొందరు పిటిషన్లు కూడా వేశారు.

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విశేషాలు తెలియజేయాటనికి వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పారు. ఈ చిత్రంలో ఏ ఒక్క సామాజికవర్గాన్ని తక్కువ చేసి చూపించలేదని అన్నారు. ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రముఖ తండ్రీకొడుకులకు అంకితమిస్తానని చెప్పారు. అయితే వారి పేర్ల‌ను ప్ర‌స్తుతానికి ఆయ‌న్ను అడ‌గ‌వ‌ద్ద‌ని అన్నారు. ఇక కేఏ పాల్ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపే పనిలో ఉన్నారన్న వర్మ.. ఆయన ఇలాంటివి పట్టించుకోరని భావిస్తున్నానని సెటైర్లు వేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version