తెలంగాణలో మళ్లీ 4 వందలపైనే కరోనా కేసులు..

-

యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్త్‌ వేవ్‌ను సైతం ఎదుర్కుంటామని ప్రకటించాయి. అయితే.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 21,918 శాంపిల్స్ పరీక్షించగా, 443 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 247 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 30, సంగారెడ్డి జిల్లాలో 27 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 493 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,02,822 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,94,014 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 4,697 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version