‘రంగమార్తాండ’ నుంచి క్రేజీ అప్డేట్​.. మెగాస్టార్ వాయిస్​తో షాయరీ

-

రంగస్థల నటుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న సినిమా ‘రంగమార్తాండ’. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి చిత్రబృందం ఓ సర్​ప్రైజ్ ఇచ్చింది. నటీనటుల జీవితం గురించి వివరించే షాయరీని విడుదల చేసింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి గళం అందించారు. అంతే కాదు.. గళం అందించే సమయంలో కంటతడి పెట్టుకున్నారు. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇందులో చిరు.. గంభీరమైన గాత్రంలో తన గురించి తానే చెప్పుకున్నట్లు అర్థమవుతోంది. ఓ నటుడు జీవన శైలి ఎలా ఉంటుంది.. రంగస్థల నటుడి జీవితం ఎలా ఉంటుంది? అనేది ఎంతో గొప్పగా వర్ణించారు. “నేనొక నటుడ్ని.. చమ్‌కీలబట్టలు వేసుకుని, అట్ట కిరీటం పెట్టుకుని, చెక్క కత్తి పట్టుకుని, కాగితాల పూల వర్షంలో కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను.. కాలాన్ని బంధించిన శాసించగల నియంతని నేను.. నేనొక నటుడ్ని.. నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని.. నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని.. వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని.. వేషం తీస్తే ఎవ్వరికీ ఏమీ కానీ జీవుడ్ని.. అంటూ సాగిన షాయరీ ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఉంది. కాగా, రంగమార్తాండ సినిమా మరాఠీలో వచ్చిన నటసామ్రాట్ అనే సినిమాకు రీమేక్‌.

Read more RELATED
Recommended to you

Latest news