బండి వర్సెస్ కేటీఆర్: డ్రగ్స్..తంబాకుపై రచ్చ..!

-

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్-బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఎవరికి వారు తగ్గకుండా రాజకీయ యుద్ధం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ గాని, ఇటు బీజేపీ గాని ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..కేసీఆర్ సర్కార్ లక్ష్యంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవితని, డ్రగ్స్ విషయంలో కేటీఆర్‌ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి కూడా బండికి కౌంటర్లు పడుతున్నాయి.

ఇదే క్రమంలో తాజాగా కేటీఆర్…బండిని టార్గెట్ చేసుకుని విరుచుకుపడ్డారు. గతంలో బండి సంజయ్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు, కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస అని, రక్తం, వెంట్రుకల నమూనా ఇస్తే నిరూపిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ బండి సంజయ్‌కి కౌంటర్ ఇచ్చారు. “డ్రగ్స్ కోసం నా రక్తం, కిడ్నీ కూడా ఇస్తా. నేను క్లీన్ చీట్ తో బయటకు వస్తే కరీంనగర్ కమాన్ దగ్గర ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకుంటారా అని ప్రశ్నించారు. నేను ఇక్కడే ఉంటాను డాక్టర్లను తీసుకురమ్మను.” అని ఛాలెంజ్ చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా బండి కూడా స్పందించారు. గతంలో బండి తంబాకు తింటారని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ కిడ్నీ పాడైందని, డ్రగ్స్ కేసులో ఎవరున్నారనే విషయాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు. అసలు కేటీఆర్ ముందే టెస్టులు చేయించుకోవడానికి కారణమేంటి? సిట్ నివేదిక బయట పెట్టాలని డిమాండ్ చేశారు. “ముందు నీ చెల్లి లిక్కర్ కేసుపై మాట్లాడు. నీ కుటుంబం మళ్లీ వస్తే… చెప్పులు ఇప్పి నెత్తి మీద పెట్టుకుని నడవాలి. నేను తంబాకు తీసుకున్నట్టు ఆధారాలున్నాయా?” అని ప్రశ్నించారు. ఇలా ఇరువురు నేతలు డ్రగ్స్, తంబాకు అంటూ విమర్శలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news