ప్రస్తుతం పేరున్న ఏ సెలబ్రిటీ నోట విన్నా ఒకటే మాట ఫిల్మ్ స్టూడియో నిర్మాణం. అందిరితో పాటు మెగాస్టార్ చిరంజీవి మదిలోనూ ఎప్పటి నుంచో ఓ స్టూడియో నిర్మించాలని డ్రీమ్ వుందట. ఇప్పటికే అల్లు అరవింద్ ఫ్యామిలీ `అల్లు స్టూడియోస్` పేరుతో ఇప్పటికే గండిపేట్ సమీపంలో పదెకరాల స్థలంలో ఆరు ఫ్లోర్లతో స్టూడియో నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం అల్లూ వారిలా స్టూడియో నిర్మాణం మాత్రం చేపట్టడం లేదు కానీ ఓ ఆర్ ఆర్ సమీపంలో వున్న తన స్థలంలో టీవీ షోలకు, మూవీ షూటింగ్‌లకు అనువుగా వుండేందుకు నాలుగు ఫ్లోర్‌ల నిర్మాణం చేపట్టబోతున్నారట. అన్నపూర్ణలో ఫోర్స్ వున్నా కొన్నింటిని జీటీవి మరి కొన్నింటిని మాటీవీ లీజుకు తీసుకుంది. దీంతో సినిమా షూటింగ్‌లకు ఫ్లోర్‌లు లభించని పరిస్థితి.
ప్రస్తుతం స్టూడియోల కంటే ఫ్లోర్‌లకే టాలీవుడ్‌లో భారీ డిమాండ్ వుందట. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించిన మెగాస్టార్ ఫ్లోర్‌ల బిజినెస్‌లోకి ఎంటర్ కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ముందు మెగా స్టూడియో నిర్మాణం చేసిన తరువాతే సిటీ ఔట్ స్కర్ట్‌లో ఔటర్ రింగ్ రోడ్‌ని ఆనుకుని వున్న తన స్థలంలో నాలుగు ఫ్లోర్‌లని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.