జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో పీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తీజా ముఫ్తీ ఓడిపోయారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి బషీర్ అహ్మద్ షాపై పోటీ చేసిన ఇల్తిజా 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఇల్తిజా పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘ప్రజల తీర్పును గౌరవిస్తున్నాను. ప్రచార సమయంలో బిజెహర ప్రజలు తనపై చూపిన ప్రేమ, మమకారాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.ప్రచారంలో తనతోపాటు కలిసి పార్టీ కోసం కష్టపడిన వారికి కృతజ్ఞతలు’ అని పోస్టు చేశారు.
కాగా, జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో పీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది.ప్రస్తుతం ఆ పార్టీ నాలుగు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది.అక్కడ కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూకుడు కొనసాగుతోంది.మధ్యాహ్నం 12 గంటలకు 51 స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీ కూటమి ముందంజలో ఉండగా..బీజేపీ 25 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.స్వతంత్రులు 9 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.