పారాలింపిక్స్ లో భారత్ తన జోరును కొనసాగిస్తోంది. తాజాగా పారాలింపిక్స్ భారత్ కు మరో గోల్డ్ మెడల్ వచ్చింది. జావెలిన్ త్రో లో భారత క్రీడాకారుడు సుమిత్ అంటిల్ కు స్వర్ణ పతకం వచ్చింది. జావెలిన్ త్రో లో ఏకంగా 68.55 మీటర్లు విసిరి.. మొదటి స్థానం లో భారత క్రీడాకారుడు సుమిత్ అంటిల్ నిలిచాడు. దీంతో భారత్ ఖాతా లో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది.
ఇక ఇప్పటికే ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగం లో భారత్ కు గోల్డ్ మెడల్ వచ్చింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ గెలిచింది అవని లేఖరా. దీంతో పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారతీయ మహిళ గా చరిత్ర సృష్టించింది. ఇక తాజాగా కాసేపటి క్రితమే… సుమిత్ అంటిల్ కు స్వర్ణ పతకం వచ్చింది. దీంతో భారత్ ఖాతా లో మొత్తం రెండు బంగారు పతకాలు వచ్చినట్లైంది.