సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ హైదరాబాద్ ని భయపెట్టింది…!

-

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై హైదరాబాద్ లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది ముస్లిం లు ధర్నాలు కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసారు. రెండు వారాల క్రితం వేలాది మంది ముస్లింలు రోడ్ల మీదకు వచ్చి భిన్నత్వంలో ఏకత్వం అంటూ, ఇంక్విలాబ్ జిందా బాద్ అంటూ నిరసనలు కూడా చేసారు.

తాజాగా హైదరాబాద్ లో ఒక సోషల్ మీడియా పోస్ట్ వివాదాస్పదంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా కొందరు మెరుపు ధర్నాకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్‌ను వైరల్ చేయడంతో హైదరాబాద్‌లోని పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ సందేశం పోలీసులకు చేరడంతో అలర్టైన పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.

‘బహదూర్‌పురా, మసాబ్ ట్యాంక్, నెక్లెస్ రోడ్, ముసారాంబాగ్, కాచిగూడ క్రాస్ రోడ్స్, టోలిచౌకి ప్రాంతాల్లో బుధవారం రాత్రి 8 గంటలకు మెరుపు ధర్నాకు సిద్ధం కావాలని, ఇందులో పాల్గొనాలని ఒక పోస్ట్ వైరల్ అయింది. దీనితో ఏదో జరగబోతుందని భావించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి భారీగా ఆయా ప్రాంతాల్లో మొహరించారు. హైదరాబాద్ పోలీసులతో సహా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్, టాస్క్ ఫోర్స్, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ ప్లాటూన్స్‌ను రంగంలోకి దించారు. కొందరు పోలీసులు సివిల్ డ్రెస్‌లో మసీదులు, రద్దీ ప్రదేశాల్లో నిఘా పెట్టారు. ఎం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news