మొదటిసారిగా మెట్రో రైలులో గుండెని తరలించిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాకి చెందిన ఒక వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడంతో, అతని గుండెను దానం చేసేందుకు కుటుంబం ముందుకు వచ్చింది. దాంతో ఎల్ బీ నగర్లోని కామినేని ఆస్పత్రి నుండి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ కి గుండెని మెట్రో రైలులో తరలించారు. ఈ నేపథ్యంలో నాగోల్ నుండి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు మెట్రో రైలు ఎక్కడా ఆగకుండా గమ్యస్థానాన్ని చేరుకుని ప్రాణాన్ని కాపాడింది.
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి గుండె తరలింపు చర్యలు జరిగేటపుడు ట్రాఫిక్ క్లియర్ అవ్వాల్సి ఉంటుంది. దానికి పెద్ద ఎత్తులో అందరి సహకారం కావాల్సి ఉంటుంది. ఐతే మెట్రో రైలు సదుపాయం ఉండడం వల్ల అలాంటి ఇబ్బందులేమీ లేకుండానే సాఫీగా సాగిపోయింది. ప్రాణాల్ని నిలబెట్టింది.