మెక్సికో అమెరికా టార్గెట్… ఇండియన్స్… భారతీయులను ఎందుకు పంపిస్తున్నారు…?

-

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు భారతీయులను టార్గెట్ చేశారు. అదే విధంగా సరిహద్దున ఉన్న మెక్సికో కూడా భారతీయులను టార్గెట్ చేసి తమ దేశం నుంచి పంపిస్తుంది. అవును ఇప్పుడు భారతీయులను ఈ వార్తలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మెక్సికో 400 మంది భారతీయులను తిప్పి పంపించింది. అటు అమెరికా కూడా… 300 మందికి పైగా భారతీయులను అమెరికా నుంచి పంపించింది. ఈ బుధవారం కొందరు అమెరికా నుంచి ఢిల్లీలో దిగారు.

మరో 180 మందిని అమెరికా పంపించడానికి సిద్ధంగా ఉందని వారంతా వచ్చే నెల మొదటి వారంలో భారత్ వచ్చేస్తారని అంటున్నారు. అసలు దీనికి కారణం ఏంటి అనేది స్పష్టంగా తెలియకపోయినా… అమెరికాలో ఉన్న భారతీయుల మీద ట్రంప్ కక్ష గట్టారని అంటున్నారు. ట్రంప్ కి మోడీకి మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయని, అది ఇజ్రాయెల్ విషయంలోనే అని అంటున్నారు. అక్కడ భారత్ కొన్ని ఆయుధాలు కొనడానికి సిద్ధమైంది. ఆ టెక్నలాజి అమెరికా వద్ద కూడా ఉంది… తమ దేశం భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా తాము వ్యతిరేకించే ఇజ్రాయిల్ తో మోడీ స్నేహం ట్రంప్ కి నచ్చడం లేదని అంటున్నారు.

అదే విధంగా చైనాతో కూడా మోడీ సఖ్యతగా ఉండటం అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. మోడీ ప్రధాని అయిన తర్వాత ఆసియా దేశాల మీద తమ పెత్తనం తగ్గింది అనే భావనలో ట్రంప్ ఉన్నారు. అదే విధంగా భారతీయులు… తమ దేశంలో ఐటి ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు అని కూడా ట్రంప్ భావిస్తున్నారు. ఇక మోడీ దక్షిణ అమెరికా దేశాలతో స్నేహం చేయడం కూడా ట్రంప్ కి రుచించడం లేదు. సౌదీ లాంటి దేశాలతో మోడీ సర్కార్ మంచి సంబంధాలే ఏర్పరుచుకుంది. దీనితో తమ ఆదాయ వనరుల మీద అవి ప్రభావం చూపిస్తున్నాయని ట్రంప్ భావిస్తున్నారట అందుకే భారతీయులను టార్గెట్ చేస్తున్నారని, సరైన పత్రాలు లేవనే కారణంతో పంపిస్తున్నారని అంటున్నారు. అటు తమతో స్నేహంగా ఉండే మెక్సికో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news