కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఎక్కడి బతుకులు అక్కడే ఆగిపోయాయి. ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. పరీక్షలు జరుగుతాయో లేదో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. అలాగే పదవ తరగతి పరీక్షలపై కూడా రద్దు చేశారు. ఇంకా చాలా పరీక్షలు పెండింగ్ ఉన్నాయి. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ విద్యార్థులు ఎప్పుడు పరీక్షలపై ఒక క్లారిటీ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు కేంద్రం హోంశాఖ అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు కేంద్ర ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శికి హోంశాఖ లేఖ రాసింది. యూజీసీ గైడ్ లైన్స్, యూనివర్సిటీల అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫైనల్ టర్మ్ ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా నిర్వహించాలని స్పష్టం చేసింది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన స్లాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది.