రూ.13వేల‌కే షియోమీ కొత్త స్మార్ట్ టీవీ..!

-

షియోమీ కంపెనీ ఎంఐ టీవీ సిరీస్‌లో రెండు నూత‌న స్మార్ట్ టీవీల‌ను భార‌త మార్కెట్‌లో సోమ‌వారం విడుద‌ల చేసింది. ఎంఐ టీవీ 4ఎ హారిజాన్ ఎడిష‌న్ సిరీస్‌లో ఈ టీవీలు విడుద‌ల‌య్యాయి. ఇవి 32, 43 ఇంచుల సైజుల్లో లాంచ్ అయ్యాయి. 32 ఇంచుల టీవీలో హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్‌ను అందించారు. 43 ఇంచుల టీవీలో ఫుల్ హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్ ను పొంద‌వ‌చ్చు. వీటిల్లో వివిద్ పిక్చ‌ర్ ఇంజిన్ (వీపీఈ)ని అమ‌ర్చారు. అందువ‌ల్ల పిక్చ‌ర్ క్వాలిటీ బాగుంటుంది.

Mi TV 4A Horizon Edition 32 and 43 inch Smart TVs launched

ఈ టీవీల‌లో ప్యాచ్ వాల్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా ఈ టీవీలు ప‌నిచేస్తాయి. 23కు పైగా కంటెంట్ పార్ట్‌న‌ర్స్‌, 16కు పైగా భాష‌ల కంటెంట్‌ను ప్యాచ్ వాల్ అందిస్తుంది. వీటిలో ఎంఐ క్విక్ వేవ్ ఫీచ‌ర్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఏదైనా వీడియో లేదా మూవీని చూడ‌డం మ‌ధ్య‌లో ఆపాక‌.. మ‌ళ్లీ వాటిని కొన‌సాగించేందుకు కేవ‌లం 5 సెక‌న్ల స‌మ‌యం మాత్ర‌మే ప‌డుతుంది. వీటిలో ఇన్‌బిల్ట్ క్రోమ్‌క్యాస్ట్ ఫీచ‌ర్‌ను ఏర్పాటు చేసినందున ఫోన్లు, ఇత‌ర డివైస్‌ల నుంచి ఈ టీవీల‌కు వీడియోల‌ను స్ట్రీమ్ చేయ‌వ‌చ్చు. అలాగే గూగుల్ అసిస్టెంట్‌, డేటా సేవ‌ర్ ఫీచ‌ర్ల‌ను కూడా వీటిలో అందిస్తున్నారు.

ఈ టీవీల‌లో 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌ల‌ను అందిస్తున్నారు. వైఫై, బ్లూటూత్ 4.2 తోపాటు హెచ్‌డీఎంఐ, ఏవీ, యూఎస్‌బీ, ఈథ‌ర్‌నెట్‌, ఎస్/పీడీఐఎఫ్ పోర్టుల‌ను అందిస్తున్నారు.

ఎంఐ టీవీ 4ఎ హారిజాన్ ఎడిష‌న్ 32 ఇంచుల టీవీ ధ‌ర రూ.13,499 గా ఉంది. దీన్ని ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ హోం స్టోర్‌ల‌లో ఈ నెల 11వ తేదీ నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే 43 ఇంచుల టీవీని ఈ నెల 15వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news