IPL MI vs KKR : ముంబై గెలిచేనా.. నేడు కోల్‌క‌త్తను ఢీ కొట్ట‌నున్న ముంబై

-

ఐపీఎల్ లో నేడు 14వ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్, కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ మ‌హారాష్ట్రలోని పూణే న‌గ‌రంలోని మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. రాత్రి 7 : 00 గంట‌ల నుంచి ప్ర‌త్యేక్ష ప్ర‌సారం కానుంది. కాగ ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫిని ముద్దాడినా.. ముంబై ఇండియ‌న్స్.. ఈ సీజ‌న్ లో దారుణంగా విఫ‌లం అవుతుంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. దీంతో పాయింట్ల ప‌ట్టికలో చివ‌రి నుంచి మూడో స్థానంలో ఉంది.

ముంబై ఆడిన తొలి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (41), తో పాటు మ‌రో ఓపెన‌ర్ ఇషాన్ కిషాన్ (81) ప‌రుగులు చేసి ఆకట్టుకున్నా.. త‌ర్వాతి బ్యాట్స్ మెన్లు విఫ‌లం కావ‌డంతో ఓడిపోయింది. అలాగే రాజ‌స్థాన్ తో జ‌రిగిన రెండో మ్యాచ్ లోనూ ఇషాన్ కిషాన్, తిలక్ వ‌ర్మ అర్థ‌శ‌తరాలు న‌మోదు చేసినా.. విజ‌యం ద‌క్క‌లేక‌పోయింది.

ఈ మూడో మ్యాచ్ లోనైనా విజ‌యం సాధించాల‌ని ముంబై ప్ర‌య‌త్నిస్తుంది. అలాగే కోల్‌క‌త్త ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్ ల‌ల్లో 2 మ్యాచ్ లు గెలిచి టాప్ 2 ప్లేస్ లో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచి అగ్ర‌స్థానానికి వెళ్లాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news