చెడుకొలెస్ట్రాల్‌ను కరిగించి బరువు తగ్గించే మెంతులు..వారికి దివ్యఔషధమే..!

-

ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లో కంటే..అద్బుతమైన ఔషధాలు వంటింట్లో ఉండే పోపుబాక్స్‌లో ఉన్నాయి..ఒకప్పుడు మన పూర్వీకులు ఇంటివైద్యాన్నే నమ్మారు. మనం ఇప్పుడు ప్రతిదానికీ..టాబ్‌లెట్‌ వేస్తున్నాం. ఈరోజు వంటింట్లో ఉండే దివ్యఔషధమైన మెంతులు గురించి తెలుసుకుందాం.

మెంతుల్లో పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి. వీటిలో పీచు పదార్ధం, ఇనుము, విటమిన్ బి1, బి2, సి, కాల్షియం వంటివి లభిస్తాయి.

షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ.. మెంతుల నానపెట్టిన నీటిని తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. దీనిలో ఉండే క్యాలరీలు కూడా తక్కువే కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. మెంతులు లినోలెనిన్చ, లినోలిక్ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి.

స్త్రీలలలో రుతుక్రమ రుగ్మతలను నయం చేయటంలో మెంతులు ఎంతోబాగా పనిచేస్తాయి. రుతుక్రమం నొప్పి నివారిణిగా పనిచేస్తాయి.

జీర్ణ సంబంధమైన సమస్యల నివారణకు ఆయుర్వేదంలో మెంతులను వినియోగిస్తున్నారు. రోజుకు కనీసం రెండు సార్లు మెంతి పొడిని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉంటుంది.

వాపు నిరోధక లక్షణాలు కలిగి ఉన్నందున కీళ్ళవాపు, తగ్గించటంలో బాగా తోడ్పడతాయి

శ్వాసకోస సమస్యలు తగ్గించటం, కఫాన్ని పోగొట్టటంలో మెంతులు బాగా ఉపకరిస్తాయి. దగ్గు, జలుబు వంటి సాధారణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. మెంతులతో టీని తయారు చేసుకుని తాగితే చక్కెర స్ధాయిలను నియంత్రించవచ్చు.

బాలింతలకు మెంతికూర పప్పు, మెంతులు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది.

మెంతులు, తేనె, నిమ్మరసం కలిపి కషాయంలా తాగితే జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

క్లోమ గ్రంథిని పోషించే కొవ్వు మేటలను ఇది శుభ్రం చేస్తుంది.

మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి పరగడుపున తాగితే ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. ఎలాంటి పొట్ట అయినా ఇట్టే కరిగిపోతుంది.

కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక టేబుల్ స్పూన్ మెంతిపొడిని నీళ్లలో మజ్జిగలో కలిపి తీసుకుంటే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.

జుట్టు కుదుళ్లను బలోపేతం చేయటంలో మెంతులు బాగా సహాయపడతాయి. మెంతులు జుట్టుకు మెరుపునిస్తాయి మరియు మృదువుగా చేస్తాయి.

చుండ్రుపై ప్రభావవవంతంగా పనిచేసే సహజ ఔషధాల్లో మెంతులు ముఖ్యమైనవి. ఒక టేబుల్ స్పూన్ మెంతులను, ఒక కప్పు కొబ్బరి నూనెలో కలిపి ఎండ తగలని ప్రదేశంలో మూడు వారాలపాటు ఉంచాలి. ఆ తర్వాత ఆ నూనెను తలపై మర్దనకు వాడితే మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు తీసుకోవటం వల్ల దుష్పలితాలు ఉంటాయి

మెంతులను గర్భిణీ స్త్రీలు తినడం మంచిది కాదు.
మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహాతో మెంతులు వాడుకోవాలి.
మెంతులు పడకపోవటం వల్ల ఎలర్జీలు వస్తాయి. అలాంటి వారు మెంతులను వినియోగించకకుండా ఉండటమే ఉత్తమం

Read more RELATED
Recommended to you

Latest news