సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌ను భారత్‌లో విడుదల చేసింది. సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో పేరిట ఆ ల్యాప్‌టాప్ విడుదలైంది. అందులో 12.4 ఇంచుల టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇంటెల్ 10వ జనరేషన్ కోర్ ఐ5 ప్రాసెసర్‌ను అమర్చారు. 16జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఎస్ఎస్‌డీ లభిస్తాయి. బిల్టిన్ స్టూడియో మైక్‌లు, ఆమ్నిసోనిక్ స్పీకర్లు, డాల్బీ ఆడియో, 720పి హెచ్‌డీ కెమెరాను ఏర్పాటు చేశారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ల్యాప్‌టాప్‌లో ఏర్పాటు చేశారు. అందువల్ల ఫింగర్ ప్రింట్ లో ల్యాప్‌టాప్‌లోకి లాగిన్ అవ్వచ్చు. ఈ ల్యాప్‌టాప్ సుమారుగా 13 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో ఫీచర్లు…
* 12.4 ఇంచుల పిక్సల్ సెన్స్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, 1536 x 1024 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 16జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు ఎస్ఎస్‌డీ
* 720పి హెచ్‌డీ కెమెరా, ఆమ్నిసానిక్ స్పీకర్స్, డాల్బీ ఆడియో
* డ్యుయల్ ఫార్-ఫీల్డ్ స్టూడియో మైక్‌లు, విండోస్ 10 హోమ్ ఓఎస్
* వైఫై 6, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 13 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
ఈ ల్యాప్‌టాప్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ ఎస్ఎస్‌డీ మోడల్ ధర రూ.63,499 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ ఎస్ఎస్‌డీ మోడల్ ధర రూ.76,199గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్‌డీ మోడల్ ధరను రూ.92,999గా నిర్ణయించారు. 16జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్‌డీ మోడల్ ధరను రూ.1,10,999గా నిర్ణయించారు. శుక్రవారం నుంచి ఈ ల్యాప్‌టాప్‌ను విక్రయిస్తారు.