మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌కు ఇక మంగళం.. విండోస్‌ పీసీల్లో వెంటనే తీసేయండి..!

-

సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఎంతటి పాపులారిటీని సంపాదించిందో అందరికీ తెలిసిందే. అలాగే పలు ఇతర మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ ఉత్పత్తులు కూడా పేరుగాంచాయి. అయితే మైక్రోసాఫ్ట్‌ తన విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో డిఫాల్ట్‌గా అందించే ఇంటర్నెట్‌ బ్రౌజర్లకు మాత్రం ఎప్పుడూ ఆదరణ లభించడం లేదు. గతంలో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ ఉండగా దాన్ని యూజర్లు పట్టించుకోవడం లేదని దాని స్థానంలో మైక్రోసాఫ్ట్‌ కొత్తగా అప్పట్లో ఎడ్జ్‌ అనే ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టింది.

microsoft to end support for edge browser from today

అయితే ఎడ్జ్‌ బ్రౌజర్‌కు కూడా సరైన ఆదరణ లేదు. దీంతో ఆ బ్రౌజర్‌కు బుధవారం నుంచి సపోర్ట్‌ను ఇవ్వడం నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. అందువల్ల యూజర్లు ఇకపై తమ విండోస్‌ పీసీల్లో ఆ బ్రౌజర్‌ను డిలీట్‌ చేయవచ్చు. అయితే ఈ బ్రౌజర్‌ను తీసేసినా దానికి బదులుగా మైక్రోసాఫ్ట్‌ మరో కొత్త బ్రౌజర్‌ను కొత్త విండోస్‌ అప్‌డేట్‌లో అందించనుంది. క్రోమియం ఎడ్జ్‌ పేరిట ఇంకో ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్‌ అందిస్తోంది. యూజర్లు తమ విండోస్‌ పీసీల్లో ఎడ్జ్‌ బ్రౌజర్‌ను తీసేసి క్రోమియం ఎడ్జ్‌ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఉపయోగించవచ్చు.

క్రోమియం ఎడ్జ్‌ బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్‌ సంస్థ గూగుల్‌ క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌లకు దీటుగా రూపొందించింది. ఆయా బ్రౌజర్లు ఎంత వేగంగా పనిచేస్తాయో తెలుసు. వాటి నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ వల్లే మైక్రోసాఫ్ట్‌ కొత్తగా క్రోమియం ఎడ్జ్‌ బ్రౌజర్‌ను రూపొందించింది. అయితే ఈ బ్రౌజర్‌ను మొదట విండోస్‌ 10లో 2019లోనే లాంచ్‌ చేసింది. కానీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. జనవరి 2020లో ఈ బ్రౌజర్‌ను అధికారికంగా విడుదల చేశారు. కానీ ఇకపై అన్ని వీండోస్‌ పీసీల్లో ఇదే బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్జ్‌ బ్రౌజర్‌ పనిచేయదు. దాని స్థానంలో క్రోమియం ఎడ్జ్‌ ను ఇన్‌స్టాల్‌ చేయాల్సి ఉంటుంది.

మైక్రోసాఫ్ట్‌ సంస్థ విండోస్‌ 10 పీసీలకు కొత్తగా అప్ డేట్‌ను అందించనుంది. దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఎడ్జ్‌ బ్రౌజర్‌ను తొలగించేందుకు ఆప్షన్‌ లభిస్తుంది. అలాగే క్రోమియం బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఉపయోగించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news